పల్నాడు (ప్రజా అమరావతి): నరసరావుపేటలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు, నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి .
పిన్నెల్లిరామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ...
కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి నుంచి ఇప్పటివరకు ఒక పెదకూరపాడు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై 300 పైగా అక్రమ కేసులు బనాయించారు.మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది.కార్యకర్తలకు నాయకులకు మనోధైర్యాన్ని కల్పించటానికి లీగల్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం.కూటమి ప్రభుత్వ బాధితులకు జిల్లా లీగల్ సెల్ కార్యాలయం బాగా సహాయపడుతుంది..
addComments
Post a Comment