ఆర్టీసీ హౌస్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

 విజయవాడ (ప్రజా అమరావతి);




ఆర్టీసీ హౌస్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు


ఈ రోజు అనగా మార్చి 7 వ తేదీన ఆర్టీసీ హౌస్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్.(R) ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సి.పి.ఎం. (హెచ్,ఆర్.డి.) కుమారి  సామ్బ్రాజ్యం అధ్యక్షత వహించారు. సంస్థలో పనిచేస్తున్న మహిళల గురించి వారు సాధించిన ప్రగతి గురించి విపులంగా తెలిపారు. అంతేకాకుండా    నేడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె వివరించారు.

అనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో మహిళలు తమవంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అటు కుటుంబ బాధ్యతలతో పాటు ఇటు ఉద్యోగ బాధ్యతలు కూడా మహిళలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనే నానుడి ఉందని అదే విధంగా మహిళలు సమాజంలో గౌరవించబడాలని తెలిపారు. 


  


 ఆర్టీసీలో 5300 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారని అంటే 15% స్థానం మహిళలదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో అనేక చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళా ఉద్యోగినుల పట్ల ఎవరైనా అసభ్యంగా, అనాలోచితంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా బస్సుల్లో మహిళా ఉద్యోగులు వారి బాధ్యతలు సమర్ధవంతంగా, ధైర్యంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. సంస్థలో మహిళలు చాలా కష్టపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారని కండక్టర్లుగా, కానిస్టేబుల్ గా, ఆఫీసుల్లో ఇలా అన్ని విభాగాల్లో కూడా తమ సేవలందిస్తూ వారి ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. అన్ని విభాగాలలోనూ వారి ఉనికిని చాటుకుని సాధికారత సాధించారన్నారు. 

ప్రధాన కార్యాలయంలోని మహిళలందరినీ ఒకే చోట చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని,  ఈ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం, వారి పట్ల మనమంతా కృతజ్ఞతా భావంతో మెలగాలన్నారు. సంస్థలోని మహిళలు చాలా ఓర్పు, సహనంతో విధులు నిర్వర్తించి సంస్థ ప్రగతిలో  తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలు పురుషల కంటే ఏమీ తీసిపోరని, వివక్ష చూపించరాదని తెలిపారు.  ఉద్యోగ బాధ్యతలతో పాటు తర్వాత ఇంటి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వారి యొక్క మనోబలంతో స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు. హెడ్డాఫీసులో  ప్రతిభ కనబరిచిన 5 గురు మహిళలను ఈ సందర్భంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. 

ఈ కార్యక్రమలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ జి.వి.రవివర్మ కూడా పాల్గొని మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళలందరికీ విజిలెన్స్ అధికారిణి  శ్రీమతి శోభామంజరి, పర్సనల్ విభాగం అధికారులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్డాఫీస్ లోని మహిళా ఉద్యోగులు  మరియు ఔట్ సోర్సింగ్ మహిళా సిబ్బంది  పాల్గొన్నారు. 

Comments